బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

30, జనవరి 2013, బుధవారం

జోగిపేట ప్రయాణ ప్రాంగణంలో బస్సు క్రింద పడి ఒక వ్యక్తి మృతి

జోగిపేట RTC ప్రయాణ ప్రాంగణంలో డ్రైవర్ అజాగ్రత్త వలన బస్సు క్రింద పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జోగిపేట లో చోటుచేసుకుంది. ముస్లాపూర్ గ్రామానికి చెందిన శంకరప్ప (45) అనే వ్యక్తి నారాయణఖేడ్ డిపో కు చెందిన బస్సు ఎక్కే ప్రయత్నంలో బస్సు ఫుట్ బోర్డ్ నుండి అదుపు తప్పి బస్సు క్రింద పడటంతో  డ్రైవర్ అజాగ్రత్తతో బస్సును నడపడంతో బస్సు క్రింద పది శంకరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు తండ్రి చనిపోయాడని తెలిసి కొడుకు తీవ్ర దుఖః సాగరంలో మునిగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును అదుపులోకి తీసుకున్నారు బస్సు డ్రైవర్ పరారిలో ఉన్నాడు.