శ్రీ చాముండేశ్వరి దేవాలయం
మంజీరానది ప్రాక్తీరం
www.jogipet.com :- జిల్లా లోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి 31 వ వార్షికోత్సవాలు ప్రారంబమయ్యాయి జోగిపేట కు 6 km ల దూరంలో చిటుకుల గ్రామ శివారులోని ఉత్తర వాహిగా ప్రవహిస్తున్నమంజీరా తల్లి ఒడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి మాతఉత్సవాలు 3 రోజులు కొనసాగుతాయి. ఇక్కడ మంజీరాకు విశిష్టత ఉంది దీనికి మంజీరా మొదటి పేరు వంజర, గరుడ గంగా కూడా దీనికి పేరున్నది వంజరుడనే రాజు గరుడ గంగరుడిని సహాయంతో గంగని భూలోకానికి తెచ్చినట్లు అందువల్లనే దీనికి వంజరయని, గరుడగంగయని పేరున్నట్లుపురాణాల్లో పేర్కొనబడింది.శ్రీ చాముండేశ్వరి మాత ప్రతిష్ట ఆనంద సంవత్సర పుష్య బహుళ సప్తమి 02-01-1983 నాడు చాల వైభవంగా ప్రతిష్టించబడింది.
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, స్వస్తి వాచనం, అఖండ దీపారాధన కలశ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో మేళ, వాయిద్యాలతో మంజీరా నదికి వెళ్లి గంగాదేవికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి భక్తులు నదీ స్నానాలు చేసి కుండల్లో అమ్మవారికి అభిషేకం కోసం నీటిని తెచ్చారు. మొదట ఆలయ అర్చకులు చాముండేశ్వరి దేవికి పాలు, పెరుగు, నెయ్యి. తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంత భక్తులు నది నుంచి తీసుకువచ్చిన నీటితో చాముండేశ్వరి దేవికి, ఆలయంలో గల బ్రహ్మణిదేవి, భద్రకాళి, వైష్ణవిదేవిలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి ఉత్సవవిగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.