బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

2, ఫిబ్రవరి 2013, శనివారం

ప్రమాదాలకు నిలయం అన్నాసాగర్ చెరువు కట్ట


అన్నాసాగర్ కట్టపైన రెండు కార్లు డీకొన్న దృశ్యం 

రెండు కార్లు ఢీ: ఏడుగురికి గాయాలు

www.jogipet.com :-రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన జోగిపేట మండల పరిధిలోని అన్నాసాగర్ చెరువుకట్టపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కారుల్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, రాజేష్, స్వాతి, అంకిత, అర్జున్‌రావు, శోభారాణి, పవన్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.