బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

16, ఫిబ్రవరి 2013, శనివారం

ఘనంగా శ్రీ వెంకటేశ్వస్వామి విగ్రహ ప్రతిషాపనా మహోత్సవం



జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవం గురువారం అత్యం త వైభవంగా జరిగింది. భక్తుల శరణుఘోషల మధ్య శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ గోదా సమేతంగా ఆలయంలో కొలువుదీరాడు. ఈ ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వైకుంఠపురం గురువారం జనసంద్రమైంది.