www.jogipet.com
ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నవారు.. తమ ఆధార్ స్థితిని ‘మీ సేవ’ కేంద్రాల్లో తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ‘మీ సేవ’ కేంద్రంలో ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆధార్ కార్డు ఇంకా అందనివారు, ఆధార్ కార్డు పోగొట్టుకున్నవారు ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన రశీదు నంబరుతో రూ. 20 రుసుం ‘మీ సేవ’లో చెల్లిస్తే ఆధార్ నంబరు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు లేకున్నా ఈ ఆధార్ నంబర్‌తో కూడిన స్టేటస్ రిపోర్టును రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, ఇతరత్రా పథకాలకు దాఖలు చేయవచ్చు.
|