ఓ గుర్తుతెలియని లారి ఆటో, బైక్‌ను వరుసగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు . మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పుల్‌కల్ మండలం అకోలా-నాందేడ్ రహదారిపై న్యూ హున్నాపూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పుల్‌కల్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ (42), అందోల్‌కు చెందిన ఆటో డ్రైవర్ సోఫీ (40), అదే మండలం సంగుపేటకు చెందిన గొల్ల అశోక్ అలియాస్ ప్రభు (30), అందోల్‌కు చెందిన వంశీ, అంజనేయులు ఆటోలో సంగారెడ్డి వైపు నుంచి జోగి పేట వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని లారి హున్నాపూర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అశోక్, ఆటో డ్రైవర్ సోఫీ, మరో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వంశీ, అంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఆటోను ఢీకొట్టిన వాహనం ఆగకుండా ముందు కు వెళ్లి అర కిలోమీటర్ దూరంలో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శివ్వంపేట వాసి గంగారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు చోట్ల ప్రమాదాలు జరిగిన విష యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మృతదేహా లను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ విజయ రామారావు, మెదక్ డీఎస్పీ గోద్రూ, జోగిపేట సీఐ సైదానాయక్, పుల్‌కల్ ఎస్‌ఐ జానకిరాములు ప్రమాద స్థలంలో వివరాలు సేకరించా రు. ఘటన జరిగిన చోట ఏపీ 24 టీబీ 3749 నంబర్ ప్లేట్ లభించిందని పోలీ సులు తెలిపారు
|