అందోల్, జోగిపేట గ్రామ పంచాయతీలను విలీనం చేసి ‘అందోల్-జోగిపేట నగర పంచాయతీ’గా ఏర్పాటు చేస్తూ శుక్రవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆధర్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ రెండు ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా పేర్కొంటూ పూర్వం జారీ చేసిన ప్రకటనను రద్దు చేస్తూ పంచాయతీ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మరో ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెం.50)ను జారీ చేశారు. ఇప్పటికే సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్,గజ్వేల్గా,ఇటీవల ఏడు గ్రామలతో కలిపిదుబ్బాకను నగర పంచాయతీ’గా చేసిన ప్రభుత్వం తాజాగా జోగీపేటను నగర పంచాయతీ’గా ఏర్పాటు చేయటంతో జిల్లాలో మొత్తం పురపాలక సంగాల సంఖ్య ఎనిమిదికి ేరినట్లైనది. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 1040కు తగ్గింది. 2006లో జరిగిన ఎన్నికల నాటికి జిల్లాలో 1059 గ్రామ పంచాయతీలుండగా నగర పంచాయతీల ఏర్పాటుతో క్రమంగా సంఖ్య తగ్గుతూ వస్తోంది.