www.jogipet.com :- సింగూర్: మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగం నీటిలో మునిగి సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ (20) ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సత్యనారాయణ శనివారం ఉదయం ఇంటి నుంచి ముగ్గురు స్నేహితులతో కలిసి జోగిపేట లోని బంధువుల ఇళ్లకు వెళ్లారన్నారు.
అనంతరం వారి వారి బంధువుల ఇళ్లలో రాత్రి పడుకుని ఉదయం తిరిగి స్వగ్రామానికి స్నేహితుడు సత్తయ్యతో కలిసి సత్యనారాయణ బయలుదేరాడన్నారు. అయితే మార్గమధ్యలో ఉన్న సింగూర్ ప్రాజెక్టులో స్నానం చేసేందుకు వీరిరువురూ దిగారు. ఈ క్ర మంలో సత్యనారాయణ నీట మునిగి మృతి చెందాడని స్నేహితుడు సత్తయ్య తెలిపినట్లు వారు వివరించారు. మృతుడు సదాశివపేట మండలం ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో పని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.