 |
స్వామి గౌడ్ |
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. తన ఖాతాలోకి మరో రెండు ఎమ్మెల్సీ సీట్లను నమోదు చేసుకుంది. తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసింది. తెలంగాణ వాదం లేనేలేదంటూ కుళ్లు వ్యాఖ్యలు చేసే సీమాంధ్ర నేతల నోళ్లకు తాళాలు వేసేలా తెలంగాణ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్లు తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీరౌండులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ఆధిక్యతను కాపాడుకుంటూ వచ్చారు. గెలుపులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి రికార్డు నెలకొల్పారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన అభ్యర్థిగా ఎన్నికల చరిత్రలో ఆయన రికార్డు నెలకొల్పారు.
మొతాం వోట్లు -58,354, పోలైన వోట్లు _52,297, స్వామి గౌడ్ - 48,470
సెకండ్ప్లేస్ - చంద్రశెకర్ - 885. చెల్లని వోట్లు - 6057.
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి ఘన విజయం
టీచర్స్ ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దిగిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన అభ్యర్థిగా ఎన్నికల చరిత్రలో ఆయన రికార్డు నెలకొల్పారు. మొత్తం ఓట్లు 18,235 కాగా, ఆయన 9,324 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి మోహన్‌రెడ్డికి 4,301 ఓట్లు వచ్చాయి. లకా్ష్మరెడ్డి-3675, కిష్టు-388, అశోక్-153, లక్ష్మినారాయణ- 18 ఓట్లు వచ్చాయి. 376 ఓట్లు చెల్లకుండా పోయాయి.