జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాదయ్య
సాధారణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ? ప్రేమవిఫలమై,కుటుంబ కలహాలతో లేక అప్పులబాధ తట్టుకోలేకనో ఆత్మహత్యా యత్నం చేసిన ఘటనలు మనం ఎన్నో చూసాం కానీ ........ పందుల దొంగతనం చేసాడని ఆరోపించటంతో తన మర్మంగావయవాలు కోసుకుని యాదయ్య (26) అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసాడు. భాధితుడు యాదయ్య జోగిపేట.కామ్ తో అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పందుల పెంపకం యాదయ్య కులవృత్తి. బుధవారం నాడు పందులను వేటాడాడు. తోటి పందులపెంపకం దారులు శ్రీను, వెంకటేష్ లు వారికి సంబందించిన పందులను పట్టుకున్నట్లు ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడినట్లు వివరించాడు . యాదయ్య మర్మాంగ అవయవాలమీద భలంగా కొట్టడంతో ఆ నొప్పిని భరించలేక పోయాడు. ఈ భాధ బరించలేక గురువారం ఉదయం పందులను కోసే కత్తితో తనకు తానే తన పురుసాలను కోసుకున్నట్లు చెప్పాడు. రక్తస్రావం చూసి చలించి పోయి ఓ ప్లాస్టిక్ కవర్ లో వేసుకొని ఆసుపత్రికి వెళ్తూనే మార్గమధ్యంలో సోమ్మసిల్లాడు. అది గమనించిన కుటుంబీకులు, బంధువులు అతన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అనంతరం వైద్యులు ప్రతమికచికిత్స అందించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.