బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

మద్యం తాగించి చోరీకి యత్నం

 జోగిపేటలో సోమవారం రాత్రి మహిళకు మద్యం తాగించి ఆమె వద్ద నున్న బంగారం , వెండి ఆభరణాలు దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. టేక్మాల్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన లింగమ్మతో అల్మాయిపేట గ్రామానికి చెందిన మొగులయ్యతోపాటు మరో వ్యక్తి పట్టణంలోని మార్కెట్ గంజ్ ఎదురుగా ఉన్న కల్లు దుకాణంలో మద్యం తాగినట్టు తెలి సింది. కొద్దిసేపటి త ర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమె వద్ద నున్న బంగారు గుండ్లు తీసుకొని వెండి కడియాలు తీయడానికి ప్రయత్నించారు. అటువైపుగా వెళుతున్న వారు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో మొగులయ్య అనే వ్యక్తి పట్టుబడగా మరో వ్యక్తి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అనీల్‌కుమార్ ఘటన స్థలం దగ్గరకు  వెళ్లి మొగులయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతిగా మద్యం సేవించడంతో మహిళ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయిస్తున్నారు. 

పట్టుపడ్డ మొగులయ్య

అపస్మారక స్థితిలో ఉన్నలింగమ్మ