బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

జోగిపేట లో ఓ మహిళ అనుమానాస్పద మృతి

www.jogipet.com :- 
 శోభ పాతచిత్రం 
  జోగిపేట లోని వ్యవసాయ మార్కెట్ ముందు నివాసం ఉంటున్న శోభ  అలియాస్ నీరజ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ...
కల్పగురు గ్రామానికి చెందిన శోభకు చోటకుర్ గ్రామానికి చెందిన లింగమయ్య తో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరు ప్ప్రస్తుతం జోగిపేటలోని ఓ అద్దె ఇంట్లో  ఉంటున్నారు. లింగమయ్య చౌటకూర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు లింగం పాఠశాలకు వెళ్ళిన తరువాత శోభ ఉరివేసుకుని మరణించింది. సాయంత్రం భర్త విదులు నిర్వర్తించుకొని ఇంటికి వచ్చి ఎంత పిలిచినా పలకక పోవటంతో స్థానికుల సహాయంతో తలుపులు తొలగించారు. ఘటన స్థలాన్ని సి.ఐ సైదా నాయక్,ఎస్.ఐ అనిల్ కుమార్ పరిశీలించి విచారణ చేపట్టారు.