బీరంగూడ కేంద్రంలో తోపులాట
సొమ్మసిల్లిన ఇద్దరు మహిళలు
పలువురికి గాయాలు
ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ‘ఆధార్’ తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆధార్ కేంద్రాల వద్ద సామాన్య ప్రజానీకం అష్ట కష్టాలు పడుతున్నారు. అవసరమైనన్నీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. పటాన్‌చెరు మండలం బీరంగూడలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రం వద్ద మంగళవారం తోపులాట జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు స్పృహ కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.