బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

6, ఫిబ్రవరి 2013, బుధవారం

టేక్మాల్ లోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు అస్వస్థత


టేక్మాల్ మండలం కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పితో బాధపడుతున్న బాలికలను పాఠశాల సిబ్బంది  టేక్మాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. పాఠశాల పక్కనుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.