బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

7, ఫిబ్రవరి 2013, గురువారం

'ఆధార్'కు అర్జంటేమీ లేదు...

మెదక్  జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌కు, ఆధార్ కార్డులకు లింకు లేదని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు జోగిపేటలో చెప్పారు.  జోగిపేటలో ని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో  కేవలం జంటనగరాల్లో మాత్రమే గ్యాస్‌కు ఆధార్ కార్డుకు, లింకు పెట్టారని, మెదక్ జిల్లాలో అలాంటిదేమీ లేదన్నారు.

భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరైనా, ప్రస్తుతానికి జిల్లా వాసులకు అలాంటి తొందర ఏమీలేదన్నారు. ఒకవేళ సమీప భవిష్యత్తులో ప్రభుత్వం రాష్ట్రమంతా ఆధార్ కార్డునుతప్పనిసరి చేస్తే ప్రత్యేకంగా అధిక సెంటర్లు ఏర్పాటు చేసి అందరికీ కార్డులిప్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.