మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో సెయింట్ మెరీస్ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.