బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

9, ఫిబ్రవరి 2013, శనివారం

ఏడుపాయల్లో అన్నీ సమస్యలే మాఘ స్నానాలకు ఇబ్బందులు

ఏడుపాయల దుర్గా భవాని  
www.jogipet.com :-తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల పై అధికారులు అశ్రద్ధ చూపుతున్నారు . గణపురం ఆనకట్టలో నాలుగు అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. దీంతో ఆదివారం జరిగే మాఘ స్నానాలు చేసేదెట్టానని భక్తులు వాపోతున్నారు. మాఘ స్నానాలకు మహా విఘ్నాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఆదాయం ప్రతియేటా భారీగా పెరుగుతున్నా, వసతుల కల్పన మాత్రం అధ్వానంగా ఉంటోంది. ప్రతి సంవత్సరం మాఘ స్నానాలు, శివరాత్రి జాతర కోసం సుమారు 10 లక్షల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అమ్మవారి దర్శనంతో పులకించిపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చూసి ఉసూరుమంటున్నారు.మాఘ స్నానాల కోసం సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేనందున ఈ సారి మడుగు నీళ్లలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఘనపురం ఆనకట్టలో ఉన్న ఒకటిన్నర అడుగుల నీరు భక్తులకు ఏ మాత్రం సరిపోతుందో తెలియని అంశం. స్నాన ఘాట్ల కోసం రూ.19.46 లక్షలు మంజూరై మూడేళ్లు కావస్తున్నా, ఇంతవరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో మంజీరా నదిలో స్నానాలు చేసే భక్తులు మృత్యువాత పడుతున్నారు. అమ్మవారి దర్శనంతో పులకించిపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చూసి ఉసూరుమంటున్నారు.