అత్యాచార నిరోధక బిల్లుకు పార్లమెంటు ఆమోదంఅత్యాచార నిరోధక బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా ఊపింది. నేర న్యాయ (సవరణ) బిల్లు-2013గా వ్యవహరిస్తున్న ఈ బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ ఈ నెల 19నే బిల్లుకు ఆమోదం తెలిపింది. అత్యాచారం, యాసిడ్ దాడులు తదితర నేరాలకు మరణ శిక్ష, జీవితాంతం జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు విధించేందుకు ఈ బిల్లును తెచ్చారు.
అత్యాచార నిరోధక నేర న్యాయ (సవరణ) బిల్లు-2013 బిల్లులోని ముఖ్యాంశాలు.....
*రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అవసరమైతే చనిపోయేంతవరకు జైలు శిక్ష, జరిమానా
*గతంలో ఈ నేరాల్లో దోషిగా తేలి, మళ్లీ అలాంటి వాటికి పాల్పడితే మరణశిక్ష
*పరస్పరామోద శృంగారానికి వయోపరిమితి 18 ఏళ్లు
*మహిళలను వెంటాడటం, ఇతరులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు దొంగచాటుగా చూసే నేరాలకు తొలిసారి పాల్పడితే బెయిల్. పదేపదే పాల్పడితే బెయిల్ నిరాకరణ. ఈ నేరాలను శిక్షార్హమైన నేరాలుగా ప్రకటిచండం ఇదే తొలిసారి
*యాసిడ్ దాడి దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష(ఈ దాడిని నే రంగా ప్రకటించడం ఇదే తొలిసారి). ఈ దాడి బాధితులకు ఆత్మరక్షణ హక్కు.
*అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులకు అన్ని ఆస్పత్రులూ తప్పనిసరిగా చికిత్స అందించాలి. నిరాకరిస్తే జైలు శిక్ష.
*పోలీసు అధికారులు, ప్రజాసేవకులు, సాయుధ బలగాల సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది.. మహిళలపై తీవ్ర నేరాలకు పాల్పడితే క నీసం ఏడేళ్ల జైలు శిక్ష. అవసరమైతే యావజ్జీవం, జరిమానా.
*రేప్ బాధితురాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక, శారీరక వికలాంగురాలైతే ఆమె వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అనుసంధానకర్త సాయంతో నమోదు చేయించడానికి అనుమతి. వాంగ్మూల ప్రక్రియను వీడియో చిత్రీకరించడం..