జేఏసీ, టీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినందుకు నిరసనగా ఈనెల 24న 24 గంటల పాటు తెలంగాణ బంద్‌ను నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రకటించాయి. టీపీజేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్ హైదరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం లోపు కేసులను ఎత్తివేసి, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమించిన వారందరిపై కేసులు బనాయిస్తూ జైళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నదని, దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పి తీరుతామని ఎంపీ విజయశాంతి హెచ్చరించారు.
22, మార్చి 2013, శుక్రవారం
24న 24 గంటల పాటు తెలంగాణ బంద్