చారిత్రక ప్రాధాన్యతను కలిగి కళాత్మక నైపుణ్యంతో నిర్మితమైన రాష్ట్ర ,జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు మెదక్ జిల్లా లో ఉన్నాయి.
కేథడ్రల్ చర్చి - మెదక్
ప్రపంచ ప్రసిద్ది గాంచిన సుందరమైన కేథడ్రల్ చర్చి మెదక్ పట్టణం లో ఉంది ఇది ఆసియా ఖండం లోనే రెండవ అతి పెద్ద చర్చిగా పేరుగాంచింది ఈ చర్చి జిల్లాకే తలమనికగా బాసిల్లుతుంది . పనికి ఆహరం ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914 లో ప్రారంబమై 1924 వరకు పదేళ్ళపాటు కొనసాగటం విశేషం ఈ అందాల మందిరాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలలనుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా సందర్శకులు అక్కడకు వస్తారు
వనదుర్గా మాత - ఏడుపాయల
రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉత్సవాలు జరిగే సుప్రసిద్ద పుణ్యక్షేత్రం '' ఏడుపాయల వనదుర్గా మాత '' ఆలయం మంజీరా నది ఎడుపాయలుగా చీరి ప్రవహించే చోట ఓ పాయ ఒడ్డున రాతిగుహలలో వనదుర్గామాత కొలువైనది. చుట్టురానది, పాయలు, కొండలు రాళ్లగుట్టలు, చెట్లపోదలతో నిండి ఉండే ఏడుపాయల ప్రాంగణం ఏడాది పొడవున నిత్యం దీప దూప నైవేద్యాలతో అలరాలుతుంది . జమదగ్ని అత్రి,కాశ్యపి,విశ్వామిత్ర,వశిష్ట,భరద్వాజ,గౌతమి అనే సప్త ఋషుల పేర్లతో మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుండే కాకా పక్క రాష్ట్రాలనుండి కూడా భక్తులు వస్తారు మహాశివరాత్రి నాడు 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించు కుంటారు.
విధ్యాధరి క్షేత్రం - వర్గల్
చదువులతల్లి సరస్వతి కొలువైన విధ్యాధరి క్షేత్రం హైదరాబాద్ కి ఆనుకొనిఉన్న వర్గల్ మండల కేంద్రమ్ లో ఉంది చదువులతల్లి కొలువై ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఎతైన కొండలపై వెలసిన ఈ ఆలయం ప్రముక పుణ్య క్షత్రంగా వెలుగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరవాసులు ఎక్కువగా వస్తుంటారు.
ఖేతకీ సంగమేశ్వర ఆలయం - ఝరాసంఘం
పురాతనమైన ఖేతకీ సంగమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది గాంచింది ఈ మందిరం ఝరాసంఘం మండలకేంద్రంలో కలదు ఇది దక్షిణ కాశిగా ఖ్యాతికేక్కింది కాశి నుంచి ఒక ఝరా ( జాలం ) ఇక్కడ ఆలయంలోని అమృత గుండంలో కలుస్తుందని ప్రతీతి అందువల్ల ఈ గుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులనమ్మకం ఏట మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు