.jpg)
బొట్టు బొట్టూ... కాపాడదాం
భారీగా తగ్గుతున్న జలమట్టాలు
ఆదా చేస్తేనే భావి తరాలకు మనుగడ
జలం... గాలి తరువాత జీవకోటికి అత్యవసరమైన ప్రకృతి వనరు. మానవాళి మనుగడలో జలానిదే ప్రధాన భూమిక. ఇతర గ్రహాలకు భిన్నంగా భూగోళంపై ప్రాణకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధాన కారణం. కానీ ప్రస్తుతం జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోయాయి. వందలకొద్దీ లోతుకు వెళ్లినా కడివెడు నీరు దక్కని పరిస్థితి. కారణాలేమైనా క్షీణించిపోతున్న ప్రకృతి సంపదలో జలం కూడా చేరిపోయింది. ఇప్పుడైనా మనం జాగ్రత్తపడి బొట్టుబొట్టూ కాపాడి భవిష్యత్ తరాలకు అందించలేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఈ రోజే ఎందుకంటే
ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న
జలవనరుల వల్ల రానున్న రోజుల్లో నీటి సంక్షోభాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1993 మార్చి 22న సమావేశమైంది. నీటి సంక్షోభాన్ని నివారించడానికి పలు చర్యలపై చర్చించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.