రెండు వేరువేరు సంఘటనలో స్నానానికి వెల్లి ఇద్దరు మృతి చెందారు.
జోగిపేట లో హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ గ్రామమంతా సంబరాలు జరుపుతుండగా ఆందోల్ సమీప ప్రాంతంలో మంజీరా నది తీరంలో స్నానానికి వెల్లి నీటమునిగి జోగిపేట కు చెందిన నాగరాజు అనే వ్యక్తి (22 సం) చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ రంగులు చల్లుకున్న నాగరాజు తన స్నేహితులు స్నానానికి వెల్లి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మంజీరా నది లో మృతి చెందాడు
జోగిపేట పట్టణానికి చెందిన ముదుటి రాజు (30) బుధవారం స్నానం చేసేందుకు మండలంలోని చింతకుంట శివారు మంజీరా నదిలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం హోలీ వేడుకలో పాల్గొన్న రాజు స్నానాలు చేసేందుకు స్నేహితులతో కలసి చింతకుంట శివారు మంజీరా నదికి వెళ్లాడు. అక్కడ నీటిలోకి దూకిన రాజు తేలకపోవడంతో స్నేహితులు కంగారు పడి వెతికారు. కాసేపటి తరువాత మృతదేహం తేలడంతో 108కు సమాచారం అందించారు. వారు రాజు మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి తీసుకువచ్చారు. మృతుడు ఈజీఎస్‌లో మేట్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ అనారోగ్యంతో ఉన్న కారణంగా కొన్ని రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలు చూస్తున్నాడు.
![]() |
నాగరాజు పాత చిత్రం |
![]() |
రాజు పాత చిత్రం |