గాల్లో తేలియాడుతూ భాలిక విన్యాసాలు
కన్నార్పకుండా చుసిన జనం
జోగిపేట - www.jogipet.com :- సాహసం చేస్తే రాజకుమారి సిద్దించటం నాటి కథ ..... విన్యాసం చేస్తే తప్ప పూట గడవకపోవటం వీరి వ్యధ. ఆడుతూ పాడుతూ చక్కగా బాల్యాన్ని ఆస్వాదించాల్సిన వయసులో ప్రమాదం అంచున నడుస్తూ బతుకుబండి నడిపిస్తున్న చిన్నారి వైనమిది.
ఓడిశా కు చెందిన 25 ఏళ్ళ దిన్దియల్, 9 ఏళ్ళ కీర్తి బృందం సాహస విన్యాసాలతో జీవన సమరం సాగిస్తున్నారు తన నాన్న డప్పు వాయిస్తుండగా కీర్తి ఒళ్ళు గగుర్పాటు కలిగించే రీతిలో స్థానిక తహశిల్దార్ కార్యాలయం వద్ద చేసిన విన్యాసాలు చూపరులను విస్మయానికి గురిచేసాయి. తలపై మూడు వస్తువులు మోస్తూ వాటిని పడిపోకుండా బాలన్స్ చేస్తూ చేతితో అడ్డంగా కర్ర పట్టుకొని తాడుపై నడుస్తూ ఈ బాలిక ఏమాత్రం తోట్రుపాటు లేకుండా చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. కాళ్ళకు జోళ్ళు వేసుకుని తాడు పై నడుస్తూ, కాళ్ళక్రింద ప్లేటుతో ముందుకు వేలుతూ చేసిన సాహస కృత్యాలు చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసాయి. పలువురు ఈ బాలిక విన్యాసాలను చూసి ఆనందించారు.