హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్ర ఆడియో రిలీజ్ వేడుక వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో వరంగల్ జిల్లా ఉర్సుగుట్టకు చెందిన రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నానక్ రాంగూడలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. జారీ చేసిన పాసులకంటే అధిక సంఖ్యలో అభిమానులు హాజరుకావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు తెలిసింది.