జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు 2 ఎంపి స్థానాలు ఉన్నాయి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న దామోదర్ రాజనరసింహ ఆందోల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారిపరిశ్రమలశాఖ మంత్రి గీతా రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సునితా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి జిల్లా అసెంబ్లీ స్థానాలనుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత 2009 సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 8 కాంగ్రెస్, మెదక్ తెలుగుదేశం, సిద్దిపేట టిఅర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. జిల్లాలో 8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవటం వలన కాంగ్రెస్ పార్టీకి జిల్లా కంచు కోటగా ఉంది అని కాంగ్రెస్ వర్గీయులు, ఉన్నత స్థాయి నాయకులు చెపుతుంటారు. పార్లమెంట్ స్థానాలలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మెదక్ పార్లమెంట్ స్థానాన్ని టిఅర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సురేష్ షేట్కార్ ప్రాతినిద్యం వహించగా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని టిఅర్ఎస్ పార్టీ విజయ శాంతి ప్రాతినిద్యం వహిస్తున్నారు.