జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయిలు హాల్ టికెట్ ఇవ్వలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య.
జోగిపేట.కాం : చదువే ప్రాణంగా భావించే విద్యార్థి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ విద్యార్థి ప్రైవేటు కళాశాల ఫీజుల భూతానికి బలయ్యాడు. ఇంటర్ పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థి కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ అలియాస్ సాయిలు (17) తన ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించాడు. అందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన కొండగారి సాయిలు జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
www.jogipet.com