పటాన్‌చెరు www.jogipet.com :- భానూర్ పంచాయతీ పరిధిలోని లహరీరిసార్ట్స్‌లో ఈ నెల 5,6 తేదీలలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే శాసనసభ స్పీకర్ నాదెండ్లమనోహర్ లహరి రిసార్ట్స్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి ఏడాది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ వ్యవహారాలపై వార్షిక శిక్షణ నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నగర శివారులోని లహరి రిసార్ట్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శిక్షణ ప్రారంభిస్తారని తెలిసింది.