డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. సిరులు పండించాల్సిన సింగూరు నీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. అసంపూర్తిగా నిర్మించిన కాల్వలు నీటి ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో నీటి ప్రవాహ దిశ మారి పంట పొలాలు నీటమునిగాయి. నీటి ప్రవాహ దిశను ఆందోల్ చెరువు వైపునకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అధికారులు గేట్లు మూసివేశారు.
పుల్కల్ మండలం సింగూర్ గ్రామ శివారులో మంజీరా నదిపై 1974లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సింగూర్ జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాలను సాగుచేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇందుకోసం 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 15 ఏళ్ల పాటు కొనసాగగా 1989లో నీటిని నిల్వచేయడం ఆరంభించారు. అప్పటి నుంచి సింగూరు నీటిని తాగు, సాగుకు ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులు అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించకుందా కాలయాపన చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సింగూరు జలాలను తాగు, సాగుకు ఇవ్వాలని డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో వివిధ రూపాల్లో 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు.. జలయజం పేరుతో 2005లో కాల్వల నిర్మాణానికి 136 జీవోను జారీ చేస్తూ రూ. 88.89 కోట్లు మంజూరు చేయించారు. ఆ తరువాత 2004-09 రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండు పర్యాయాలకు కూడా మంత్రి పదవులు దక్కించుకున్నాడు . కానీ ఇప్పటి వరకు సేద్యానికి నీరు అందించాలేకపోయాడు ఇలా ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్న్ నిర్వహించడం వల్ల అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందనుకున్న సింగూరు జలం రైతన్నల రెక్కల కష్టాన్ని వృథా చేసింది. కాల్వల నిర్మాణం పనులు పూర్తి కాకముందే నీళ్లు వదలటం వల్లే ఈ పరిస్థితి తె లెత్తింది. దీంతో ‘సింగూరు’ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరో ఏడాది గడిస్తే తప్ప రైతన్నలకు సింగూరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
మెదక్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం సింగూర్ లో ఎడమ కాలువ జలాలని డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ అట్టహాసంగా ప్రారంభించిన తరువాత అధికారులు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ గుండా అందోల్ చెరువుకు నీళ్లు వదిలారు. 12 గంటల పాటు పారిన నీరు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందోల్ మండలం మాసానిపల్లి వరకు చేరింది. అయితే మాసానిపల్లి నుంచి ప్రధాన కాల్వ లేకపోవడం తో అధికారులు పిల్ల కాల్వల్లోకి సింగూరు నీటిని మళ్లిం చారు. ఈ పిల్ల కాల్వలు కూడా అసంపూర్తిగానే ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతి తట్టుకోలేక కాల్వలు ఎక్కడికక్కడ తెగిపోయాయి.
నీళ్లు పంట పొలాలు, బీడు భూముల్లోకి ప్రవహించాయి. రాత్రంతా సింగూరు జలం వృథాగానే పోయింది. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన కాంట్రాక్టర్లు కాల్వలకు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. జేసీబీలను తెప్పించి కాల్వల మధ్యలో నిర్మించిన సిమెంట్ దిమ్మెలను ధ్వంసం చేశారు. అనంతరం కట్టలు తెగిపోయిన చోట మట్టితో పూడ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో నీరు మాసానిపల్లికిచెందిన వీరన్న అనే రైతు వరి పొలం మీదగా పారి డాకూరు కట్టు కాల్వల్లోకి మళ్లింది. మరోవైపు డాకూరుకుకట్టుకాల్వలోకి భారీగా నీరు చేరడంతో ఆప్రాంతంలోని కాల్వకు పలుచోట్ల గండిపడింది.
అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు.
డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ఆందోల్ నియోజక వర్గం లోని ప్రభుత్వ కాంట్రాక్టులు దామోదర బావమరిది అనిల్ రెడ్డి కి అప్పచెప్పి పనులు పూర్తి చేయమని కోరితే అతను బావను అడ్డుపెట్టుకొని బిల్లులను లేపుకుని పనుల్ని అసంతృప్తిగా ఉంచడం అనిల్ రెడ్డి తీరు . ప్రభుత్వం రూపాయలు కొట్లలో స్వాహా చేసి ప్రభుత్వానికి మోసం చేస్తూ నాణ్యతా లోపమైన పనులు చేపడుతున్నా ఎలాంటి ప్రశ్న వేయని జిల్లా అధికారులు నాణ్యతా లోపంలో భాగం ఈ సింగూర్ జల కాలువల తీరు