బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

మరవెల్లి సజీవ దహనం - మిస్టరీ Ntv





స్థల వివాదమే ఇంత  గోరానికి కారణమా 
రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా 
పెంటయ్య ను టార్గెట్ చేస్తే భార్య పిల్లలు భలయ్యరా 
నేతల వత్తిళ్ళ కారణంగా పోలీసులు ఈ కేసు పై  నోరు మెదపట్లేదా అగ్ని ప్రమాదం అంటూ పక్క దోవ పట్టిస్తున్నారా ?

 జనవరి 23వ తేది అర్ధ రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గమ్ మండలం మరవెల్లి గ్రామం ఉరంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో ఎస్ సి కాలనీ లో ఉన్న పెంటయ్య అనే వ్యక్తి చెందిన పూరి గుడిసె మంటల్లో కాలిపో సాగింది చుట్టు పక్కల వాళ్ళు గమనించే లోపే నలుగురు సజీవ దహనమయ్యారు  పెంటయ్య భార్య ఇద్దరు పిల్లలు ,అతని అత్తా మాది మసైపోయారు.     
                                    నిద్ర పోదామని మూసిన కళ్ళు తెరవనె లేదు అమ్మ పొత్తిళ్ళలో పడుకున్న పసివాళ్ళు మాంస ముద్దలుగా మారారు పిల్లల తల్లి ఆమె తల్లి మొత్తం నలుగురు అగ్ని ఖీలాలకు సజీవ దహనమయ్యారు కరెంట్ మీటరు లేని ఇంట్లో షార్ట్ సర్క్యు ట్ ఎలా జరిగింది తల దాచుకోమని స్తలమిచ్చిన దాతలే వాళ్ళ బతుకుల్ని కాలరల్చార పెద్ద మనుషుల్లా చలమవుతున్న వారే నలుగురి చావుకి ముహూర్తం పెట్టారా . . . .  

            పెంటయ్య కుటుంబం పదేళ్ళ క్రితం బతుకు తెరువు కోసం మరవెల్లి గ్రామానికి వలస వచ్చారు అప్పటి పెద్దలు కొంత స్తలాన్ని దానంగా ఇచ్చారు అప్పటి నుండి ఆ స్తలంలో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు ఆచం అనే వ్యక్తీ ఆ స్తలం తనదని పెంటయ్య ను ఖాళి చేయాలని బెదిరిస్తున్నాడు ఈ విషయంలో 23వ తేది మధ్యాహ్నం గొడవ జరిగింది స్తలం ఖాలీ చేయకపోతే ఇంటిల్లి పాదిని చంపేస్తానని ఆచం బెదిరించాడు ఎప్పుడు ఉండే గొడవే అని గ్రామస్తులు లైట్ తీసుకున్నారు కాని అదే నలుగురి ప్రాణాల్ని బలి తీసుకుంటుందని ఊహించ లేకపోయాం అంటున్నారు స్థానికులు.  

              పెంటయ్య స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటాడు అతను trs పార్టీ లో తిరగటం ఊల్లొని కాంగ్రెస్  నాయకులకు మింగుడు పడటం లేదు స్తలం ఇచ్చి ఊల్లొ ఉండనిస్తే ప్రత్యర్ది పార్టీ లో తిరుగుతున్నాడనే కోపంతో ఆచం ను పురిగొల్పినట్లు తెలుస్తోంది మరవెల్లి లో కాంగ్రెస్ లీడర్ సంగమేశ్వర్ హవా నడుస్తూ ఉంటుంది అతనే అచం ని ప్రోత్సహించి పెంటయ్య కు స్పాట్ పెట్టాడని అతను లేకపోవటంతో కుటుంబ సభ్యులు బలయ్యారని గ్రామం లో గుసగుసలు వినిపిస్తున్నాయి పాత కక్షలే ఈ ఘాతుకానికి కారణం అంటున్నారు స్థానికులు