బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

2, జనవరి 2013, బుధవారం

      మద్యం కిక్కుతో.. ఫుల్ జోష్ 2012 


మెదక్ జిల్లా ,  సంగారెడ్డి :
             2013 సంవత్సరం రానే వచ్చింది... అప్పుడే 2012 గడిచిపోయింది... 2013కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇందులో బొకేలు ఇచ్చుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, గ్రీటింగులు చెప్పుకోవడం ఒకఎత్తయితే... మందు కిక్కు నింపిన ఫుల్‌జోష్‌తో స్వాగతం పలకడం మరోఎత్తు. ప్రభుత్వం ఈ ఏడాది మద్యం ధరలను పెంచినా గతంలో వ్యాపారులు అమ్మిన ధరలకు అనుగుణంగానే ఉండడంతో రెండు కోట్ల రూపాయల మేర అదనంగా అమ్మకాలు జరిపారు.

2011 డిసెంబరులో జిల్లావ్యాప్తంగా 39 కోట్ల 67 లక్షల 12 వేల 766 రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ సంవత్సరంలో బెల్టుషాపులు ఎక్కువ సంఖ్యలోనే ఉండడం, దాబాలలోనూ మద్యం విక్రయాలు సాగడంతో ఈ స్థాయిలో అమ్మకాలు జరిగినట్టు అధికారవర్గాలు చెప్పాయి.


కాగా...2012 డిసెంబరుకు వచ్చేసరికి బెల్టుషాపులు బాగా తగ్గిపోయాయి. ఎస్పీ మహంతి ఆదేశాలతో దాబాలలో మద్యం అమ్మడం, తాగడం తగ్గింది. అయినా మద్యం అమ్మకాలు మాత్రం 2011 డిసెంబర్‌కన్నా 2012 డిసెంబరులో అధికంగా జరిగాయి. ఈ అమ్మకాల విలువ 41కోట్ల 60 లక్షల 53 వేల 935 రూపాయలగా నమోదైంది.


2013 సంవత్సర వేడుకల కోసం జిల్లాలోని మద్యం వ్యాపారులు నాలుగైదు రోజులుగా కోట్లాది రూపాయల మద్యంను బ్రీవరేజ్ కార్పొరేషన్ నుంచి తెప్పించి అమ్ముకున్నారు. జిల్లాలోని బ్రీవరేజ్ కార్పొరేషన్ నుంచి డిసెంబర్ 27న 2 కోట్ల 23 లక్షల 79 వేల రూపాయల మద్యం అమ్ముడవగా, 28న కోటీ 97 లక్షల 58వేల రూపాయలు, 29న కోటీ 22 లక్షల 96 వేలు, 30న కోటీ 37 లక్షల 72 వేల రూపాయల మద్యంను వ్యాపారులు తీసుకెళ్లారు. కాగా డిసెంబర్ 31న ఉదయం నుంచి సాయం త్రం వరకు రూ.2.30కోట్ల విలువైన మద్యంను వ్యాపారులు తమ తమ వైన్స్, బార్ షాపులకు తీసుకెళ్లారు.


2012కు వీడ్కోలు, 2013కు స్వాగతంచెప్పేందుకు సోమవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అన్ని పట్టణాలలో మద్యం దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. గతంలోకన్నా ఈసారి మద్యం ధరలను ప్రభుత్వంపెంచినా కొనుగోలు చేయడానికి మందు బాబులు వెనుకాడ లేదు. గతంలో ఎంఆర్‌పీ ధర తక్కువగా ఉన్నా వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా పెంచి విక్రయించారు..


అప్పట్లో రాయల్‌స్టాగ్ 118 రూపాయnలు ఎంఆర్‌పీ ధర ఉంటే వ్యాపారులు 125 నుంచి రూ.130 వరకు అమ్మేవారు. అలాగే ఐ.బీ. ధర రూ.89, ఓ.సీ. రూ.74, స్ట్రాంగ్ బీర్ రూ.75, లైట్ బీర్ రూ.71 ల ఎంఆర్‌పీ ధర ఉండగా వ్యాపారులు 10 నుంచి 15 రూపాయల వరకు పెంచి విక్రయించారు.


కాగా ఈసారి ప్రభుత్వం ఎంఆర్‌పీ ధరను పెంచి, అంతకు మించి అమ్మరాదని వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. అలా పెంచిన ధర కొన్నింటిపై గతంలో వ్యాపారులు అమ్మిన ధరకన్నా అధికంగానే ఉన్నది. రాయల్ స్టాగ్‌ను గతంలో రూ.125ల కు అమ్మితే ఈసారి ఎంఆర్‌పీ ధరమేరకు రూ.130లకు అమ్ముతున్నారు. అలాగే ఐ.బీ.ని రూ.110లకు, స్ట్రాంగ్ బీర్‌ను రూ.85లకు, లైట్ బీరును రూ.75 లకు అమ్ముతున్నారు. ఏమైనా మందు లేనిదే జోష్ రాదనుకుంటున్నవారు 2013 సంవత్సర స్వాగత వేడుకలలో అధికమొత్తం మద్యం విక్రయాల ద్వారా హుషారు నింపడం గమనార్హం.