ఏడాదిలో రూ.2.89కోట్ల ఆదాయం
SANGAREDDY MEDAK DISTRICT : దోపిడీలు, దొంగతనాలలో ప్రజలు కోల్పోయిన ఆస్తులను రికవరీ చేయడంలో దృష్టి సారించని పోలీస్ యంత్రాంగం మోటారు వాహన చట్టం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని మాత్రం గణనీయంగా పెంచింది.
ప్రజల ఆస్తులను రికవరీ చేసి, వారికి అప్పగించడంలో చూపించని చొరవను పోలీసులు మోటారు వాహనాల చట్టాన్ని ఉపయోగించి ప్రజల నుంచి పెనాల్టీగా రూ.2.89 కోట్లను వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ.బుక్ లేకపోవడం, ద్విచక్రవాహనాలపై ముగ్గురు ప్రయాణించడం వంటి కారణాలతో పోలీసులు మోటారు వాహనాల చట్టం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల నుంచి పెనాల్టీని వసూలు చేశారు.