www.jogipet.com :- మెదక్ జిల్లా జోగిపేటలో స్వామివివేకానంద 150 వ జయంతిని పురస్కరించుకొని హిందూవాహిని, భజరంగ్ దళ్,అర్.ఎస్.ఎస్,బిజేపి ఆధ్వర్యంలో భారి ర్యాలి నిర్వహించారు స్తానిక పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి స్వామివివేకానంద చిత్ర పటాన్ని వాహనం పై ఊరేగిస్తూ ద్విచక్ర వాహనాలపై కాషాయం జెండాలతో జైశ్రీరాం, భారత్ మతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి గుండా సాగుతూ పట్టాన పురవీదులలో తిరుగుతూ హనుమాన్ చౌరస్తా ,మధ్యరంగం ,గౌని ,పోచమ్మ దేవాలయం మీదుగా ఆందోల్ గ్రామం లోని స్వామివివేకానంద విగ్రహం వరకు సాగింది. విగ్రహానికి నాయకులు ప్రభాకర్ గౌడ్ ,జూకంటి లక్ష్మన్,గాజుల నవీన్, మనసన్ పల్లి మల్లిఖార్జున్, ఎదిరే విట్టల్, పండరి, చాముండేశ్వరి క్రిష్ణ,పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘణంగా నిర్వహించారు అనంతరం జయంతిని పురస్కరించుకొని మీటాయీలు పంచి పెట్టారు అనంతరం నాయకులూ మాట్లాడుతూ స్వామివివేకానంద జీవిత ఆశయాలు గొప్పతనాన్ని వివరించారు స్వామివివేకానంద నడిచిన బాటలో యువకులు ఆదర్శంగా తీసుకుని దేశానికి ఆధర్శవంతమైన యువకులుగా ఎదగాలని సూచించారు స్వామీజి పయనించిన భాటలో ఈతరం వారు సేవా భావాల్లో ముందుండాలన్నారు.