బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

26, జనవరి 2014, ఆదివారం

కేరాఫ్..జైగురు సేఠ్ షాప్

 ఆయనో చిరు ధాన్యాల వ్యాపారి. చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ ఊరిలో ఏదీ కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా ఆయన దుకాణానికి వెళ్లాల్సిందే. వ్యాపారంలోను, వ్యవహారంలో నీతి నియమాలకు విలువిచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్న గ్రామంలో ఆయన ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏళ్లుగా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంత సుదీర్ఘకాలంగా ఒకే చోట వ్యాపారాన్ని కొనసాగిస్తూ, ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఆయన ఊరుకు, ఆ ప్రాంతానికి ఒక గుర్తుగా మారాడు. ఆ వ్యాపారి పేరు బందం నరసింహులు. జైగురు సేఠ్ గా ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జోగిపేటలో ఏ చిన్న పిల్లాడినడిగినా జై గురు సేఠ్ తెలుసంటారు. షాప్ కు ఎలా వెళ్లాలో చెప్తాడు. ఆయనది మెదక్ జిల్లా, ఆందోళ్ మండలం జోగిపేట గ్రామం.
జైగురు సేఠ్ నేపథ్యం..
    జైగురు సేఠ్ అసలు పేరు బందం నరసింహులు. జిల్లాలోని ఆందోళ్ మండలం జోగిపేట గ్రామానికి
బతుకు దెవరు కోసం భార్యాబిడ్డలతో, కట్టుబట్టలతో వచ్చాడు. జైగురు కుటుంబం సొంత ఊరు విడిచి జోగిపేటకు వలస రావడానికి బలమైన కారణమే ఉంది. సింగూరు డ్యాం నిర్మాణంలో వాళ్ల ఇళ్లేకావు. మొత్తం ఊరే పోయిందట. జోగపేటకు వచ్చిన నరసింహులు మంచితనంతో క్రమంగా ప్రాంత ప్రజలకు దగ్గరయ్యాడు. అక్కడి వారితో కల్సిపోయాడు. వారి కష్టసుఖాలు పంచుకున్నాడు. వారిలో ఒకడయ్యాడు. పంటల సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనడం, తిరిగి అమ్మడం లనే చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కొత్తలో ఆయనే ఊరూరా పంట పొలాల వెంట తిరుగుతూ కొనుగోళ్లు చేసేవాడు. అయితే వయసు మీదపడడంతో ఇప్పుడు ఆయన గ్రామాలకు వెళ్లడం తగ్గించేశాడు. జైగురు సేఠ్ మీద నమ్మకంతో రైతులు, గ్రామస్థులే ఆయన దగ్గరికికొస్తున్నారు.
   జైగురు కస్టమర్లు కూడా చాలా పేదవాళ్లు. వాళ్లంతా రైతులు, రైతు కూలీలు, సామాన్య ప్రజలు. మరో ముఖ్యమైన విషయమేమంటే ఎక్కడా దొరకని ధాన్యం గానీ, విత్తులు, గానీ ఈ షాపులో తప్పక దొరుకుతాయి. షాపులో మనకు తెలియయని ఎన్నో రకాల సరుకులున్నాయి. పైగా వాటి పేర్లు డబ్బాలపై చాలా నీట్ గా రాసి పెట్టాడు. ఉసిరికి పప్పు, కరక్కాయలు, టానియలు, బార్లీ బియ్యం, బొంగు తనాసిరి, కూప్ కూలీలు, తాల్మఖానా, జాపత్రి, తెల్లఆవాలు, మెలిగరం, మాబులపు కాయలు అలాగే తాలీసు పత్రి, వాయు లవంగాలు, మరాఠీ మొగ్గలు, తెల్ల తీగుడు, అతి వాజ, కోస్ట్ కుటిక (నల్లది), ధామ్ పుల్లి వంటి సరుకులన్నీ రెగ్యులర్ గా అందరూ వాడేవి కాకపోయినా వీటి అవసరం ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి వస్తూనే ఉంటుంది. ఇటువంటి అరుదైన వస్తువులు దొరకడం వల్లే జైగురు షాప్ ఈ ప్రాంతంలో అంత పాపులర్ అయ్యింది. పైగా సరుకులు నాణ్యతకు భరోసా కూడా ఉంటుందని కస్టమర్లంటున్నారు. అలాగే జైగురు సేఠ్ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టకుంటున్నాడు. ఆ గ్రామంలో ఆయన షాపు ప్రారంభించినప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు ఊరు ఎంతో పెరిగిపోయింది. తాను మాత్రం చిన్న షాపునే నమ్ముకుకొని, నడుపుతున్నాడు.

జైగురు దినచర్య..
   
జైగురు సేఠ్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. నుదుటి మీద పెద్ద విభూతి రేకలు ధరించి ఒక యోగిలా ఉంటాడు. ఆయన అలవాట్లు, జీవితమూ చాలా సాధారణంగా ఉంటుంది. ప్రతీరోజు దైవ పూజతోనే ఆయన దినచర్య ప్రారంభమవుతుంది. నమ్మిన గురువు చిత్రపటానికి హారతి ఇవ్వకుండా, నమస్కరించకుండా జైగురు బయటలకురాడు. ఇప్పటికీ జైగురు షాపులో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తాడు. సరుకులను సర్దుతూ డిస్ప్లే సరిగ్గా ఉండేలా చూసుకుంటాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాడు. మధ్యాహ్నం సమయంలో కస్టమర్ల రద్దీ అంతగా ఉండదు కాబట్టి ఆయన కాసేపు షాపు కట్టేస్తాడు. విశ్రాంతి తీసుకునే ముందు పుస్తక పఠనం చేయడం జైగురుకు అలవాటు. ఉన్నంతలోనే తృప్తి పడాలని, పరుగెత్తి పాలు తాగాల్సిన పని లేదన్నది ఆయన సిద్ధాంతం. అలాగే తాము సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోష పెట్టాలంటాడు. ఇంట్లో రోజుకు కనీసం ఐదుగురికి సరిపడా భోజనం సిద్ధంగా ఉంటుంది. సమాజం పట్ల ఆయనకు, వీరి కుటుంబానికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెల్సుకోవచ్చు.
జైగురు సేఠ్ కుటుంబం
   
జైగురు సేఠ్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కుమారులిద్దరూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తండ్రి చేసే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు జరిగాయి. కొడుకులు, కోడళ్లు, అందరూ ఒకే ఒంట్లో ఉంటున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. జైగురు బయటి వారితోనే కాదు, ఇంట్లో వారితో కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. జీవన పోరాటంలో అరవై ఏళ్లు పైబడినా జైగురు అలసిపోయినట్లు కన్పించడు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఉన్నంతలో సంతృప్తి పడటం, నలుగురికి సాయపడడం, వ్యాపార వ్యవహారంలో నిజాయితీగా ఉండటం తన ఆనందకర జీవితానికి కారంణంగా చెప్తాడు ఆయన.
   వ్యాపారమంటే మోసాలతో కూడుకున్నదనే అభిప్రాయం ఇప్పుడు అందరితో ఏర్పడింది. కానీ నిజానికి వ్యాపారం కూడా విగతా వృత్తుల్లాంటిది. కమ్మరి, కుమ్మరి, నేతన్నలు, రైతులు ఎలాగైతే తమతమ వృత్తుల ద్వారా సమాజ మనుగడకు తోడ్పడుతున్నారో వ్యాపారస్థులు కూడా ఆ తరహాలోనే సాయాపడాలి. అంటే లాభాపేక్ష ఒక్కటే వ్యాపారుల లక్ష్యం కాకూడదు. ఈ సత్యాన్ని బయటకు చెప్పకపోయినా ఆచరణలో చూపిస్తున్నాడు ఆయన.

24, జనవరి 2014, శుక్రవారం

మెదక్ జిల్లాలో గుడిసె దగ్ధం.. నలుగురి సజీవ దహనం


మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మర్వెల్లి గ్రామానికి పెంటయ్య కుటుంబం కూలీ పనులు చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి వారు నివసిస్తున్న గుడిసెకు ఒక్కసారిగా నిప్పంటుకొని దహనమైంది. దీంతో అందులో నిద్రిస్తున్న పెంటయ్య భార్య లక్ష్మి (35), కూతురు పోచమ్మ (3), కొడుకు మొగులయ్య (1), అత్త  చంద్రమ్మ (45) సజీవ దహనమయ్యారు.