15, ఫిబ్రవరి 2014, శనివారం
సింగూర్ అవినీతి కాలువలు
డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. సిరులు పండించాల్సిన సింగూరు నీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. అసంపూర్తిగా నిర్మించిన కాల్వలు నీటి ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో నీటి ప్రవాహ దిశ మారి పంట పొలాలు నీటమునిగాయి. నీటి ప్రవాహ దిశను ఆందోల్ చెరువు వైపునకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అధికారులు గేట్లు మూసివేశారు.
పుల్కల్ మండలం సింగూర్ గ్రామ శివారులో మంజీరా నదిపై 1974లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సింగూర్ జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాలను సాగుచేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇందుకోసం 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 15 ఏళ్ల పాటు కొనసాగగా 1989లో నీటిని నిల్వచేయడం ఆరంభించారు. అప్పటి నుంచి సింగూరు నీటిని తాగు, సాగుకు ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులు అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించకుందా కాలయాపన చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సింగూరు జలాలను తాగు, సాగుకు ఇవ్వాలని డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో వివిధ రూపాల్లో 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు.. జలయజం పేరుతో 2005లో కాల్వల నిర్మాణానికి 136 జీవోను జారీ చేస్తూ రూ. 88.89 కోట్లు మంజూరు చేయించారు. ఆ తరువాత 2004-09 రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండు పర్యాయాలకు కూడా మంత్రి పదవులు దక్కించుకున్నాడు . కానీ ఇప్పటి వరకు సేద్యానికి నీరు అందించాలేకపోయాడు ఇలా ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్న్ నిర్వహించడం వల్ల అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందనుకున్న సింగూరు జలం రైతన్నల రెక్కల కష్టాన్ని వృథా చేసింది. కాల్వల నిర్మాణం పనులు పూర్తి కాకముందే నీళ్లు వదలటం వల్లే ఈ పరిస్థితి తె లెత్తింది. దీంతో ‘సింగూరు’ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరో ఏడాది గడిస్తే తప్ప రైతన్నలకు సింగూరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
మెదక్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం సింగూర్ లో ఎడమ కాలువ జలాలని డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ అట్టహాసంగా ప్రారంభించిన తరువాత అధికారులు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ గుండా అందోల్ చెరువుకు నీళ్లు వదిలారు. 12 గంటల పాటు పారిన నీరు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందోల్ మండలం మాసానిపల్లి వరకు చేరింది. అయితే మాసానిపల్లి నుంచి ప్రధాన కాల్వ లేకపోవడం తో అధికారులు పిల్ల కాల్వల్లోకి సింగూరు నీటిని మళ్లిం చారు. ఈ పిల్ల కాల్వలు కూడా అసంపూర్తిగానే ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతి తట్టుకోలేక కాల్వలు ఎక్కడికక్కడ తెగిపోయాయి.
నీళ్లు పంట పొలాలు, బీడు భూముల్లోకి ప్రవహించాయి. రాత్రంతా సింగూరు జలం వృథాగానే పోయింది. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన కాంట్రాక్టర్లు కాల్వలకు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. జేసీబీలను తెప్పించి కాల్వల మధ్యలో నిర్మించిన సిమెంట్ దిమ్మెలను ధ్వంసం చేశారు. అనంతరం కట్టలు తెగిపోయిన చోట మట్టితో పూడ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో నీరు మాసానిపల్లికిచెందిన వీరన్న అనే రైతు వరి పొలం మీదగా పారి డాకూరు కట్టు కాల్వల్లోకి మళ్లింది. మరోవైపు డాకూరుకుకట్టుకాల్వలోకి భారీగా నీరు చేరడంతో ఆప్రాంతంలోని కాల్వకు పలుచోట్ల గండిపడింది.
అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు.
డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ఆందోల్ నియోజక వర్గం లోని ప్రభుత్వ కాంట్రాక్టులు దామోదర బావమరిది అనిల్ రెడ్డి కి అప్పచెప్పి పనులు పూర్తి చేయమని కోరితే అతను బావను అడ్డుపెట్టుకొని బిల్లులను లేపుకుని పనుల్ని అసంతృప్తిగా ఉంచడం అనిల్ రెడ్డి తీరు . ప్రభుత్వం రూపాయలు కొట్లలో స్వాహా చేసి ప్రభుత్వానికి మోసం చేస్తూ నాణ్యతా లోపమైన పనులు చేపడుతున్నా ఎలాంటి ప్రశ్న వేయని జిల్లా అధికారులు నాణ్యతా లోపంలో భాగం ఈ సింగూర్ జల కాలువల తీరు
14, ఫిబ్రవరి 2014, శుక్రవారం
‘సింగూరు’ ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్ రన్ చేసిన DYCM
‘సింగూరు’ మళ్లీ ఎన్నికల ప్రాజెక్టుగానే మిగిలింది. ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్న్ నిర్వహించడం, ట్రయల్న్ నీటిపై ఆధారపడి పంటలు వేసుకోవద్దని సింగూర్ ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ జగన్నాథం ప్రకటించడం రైతులను విస్మయానికి గురిచేసింది. సింగూరు తూ ము నుంచి 0.15 టీఎంసీల ( 768.66 క్యూసెక్యులు) నీరు దిగువకు వదిలేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ నీళ్ల ద్వారా ముందు గా అందోల్ పెద్ద చెరువును నింపుతామనీ, ఆ తర్వాత పుల్‌కల్ మండలంలోని 5 చెరువులు, అందోల్ మండలంలో మరో 2 చెరువులు నింపుతామని అధికారులు చెబుతున్నారు. నిజంగా ఈ నీరంతా నేరుగా పంట పొలాల్లోకి వెళ్తే సుమారు 7.5 వేల ఎ కరాలకు నీరు పారాలి కానీ, ప్రస్తుతం సెంటు భూమికి కూడ నీ రు అందే పరిస్థితి లేదని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు.
అధికారుల్లో ఆందోళన...
సింగూరు తూము నుంచి ఆందోల్ చెరువు వరకు 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం కేవలం 22 కిలో మీటర్లు మాత్రమే కాల్వ పూర్తి చేశారు. అది కూడా అసంపూర్తిగానే తవ్వి వదిలేశారు. దీంతో ట్రయల్ రన్ కింద వదిలిన నీరు ఆందోల్ చెరువులకు చేరుతుందో లేదో అని అధికారులు అందోళన చెందుతున్నారు. కుడి ఎడమ కాల్వలు కలిపి 60 కిలో మీటర్లు మెయిన్ కెనాల్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పూర్తి అయింది కేవలం 42 కిలో మీటర్లు మాత్రమే. ఎక్కడ కూడా పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. మెయిన్ కాల్వకు ఏ ఒక్క చోట కూడా పిల్ల కాల్వలు కలపలేదు. ఇవేమీ లేకుండానే ట్రయల్ ర న్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2005లో వైఎస్సార్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి రూ 89.98 కోట్లు మంజూరు చేస్తూ 139 జీవోను విడుదల చేశారు. ఎత్తిపోతల ద్వారా కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాల్లో 2500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ఆందోల్, పుల్‌కల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు కలిపి మొత్తం 40 వేల ఎకరాల్లో సాగునీరు అందించాలని సంకల్పించారు. మొదటి విడత కింద రూ. 35 కోట్లు వైఎస్సార్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 60 శాతం పనులు పూర్తి అయ్యాయి.
వైఎస్సార్ మరణం తర్వాత మూడేళ్ల వరకు ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి 2013 బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్లు కేటాయించేలా చూశారు. ఎందుకోగాని వాటిని ఖర్చు చేయలేదు. తిరిగి అవే నిధులను 2014 బడ్జెట్‌లో కేటాయించారు. ఆ నిధులతో వైఎస్సార్ చేసిన పనులకే పైపై మెరుగులు దిద్ది ‘మమ’ అనిపించారు. ప్రస్తుతం ఎడమ కాల్వ వద్ద లిఫ్టు పనులు చేస్తున్నారు. ఈ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.
4, ఫిబ్రవరి 2014, మంగళవారం
మరవెల్లి సజీవ దహనం - మిస్టరీ Ntv
స్థల వివాదమే ఇంత గోరానికి కారణమా
రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా
పెంటయ్య ను టార్గెట్ చేస్తే భార్య పిల్లలు భలయ్యరా
నేతల వత్తిళ్ళ కారణంగా పోలీసులు ఈ కేసు పై నోరు మెదపట్లేదా అగ్ని ప్రమాదం అంటూ పక్క దోవ పట్టిస్తున్నారా ?
జనవరి 23వ తేది అర్ధ రాత్రి మెదక్ జిల్లా అల్లాదుర్గమ్ మండలం మరవెల్లి గ్రామం ఉరంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో ఎస్ సి కాలనీ లో ఉన్న పెంటయ్య అనే వ్యక్తి చెందిన పూరి గుడిసె మంటల్లో కాలిపో సాగింది చుట్టు పక్కల వాళ్ళు గమనించే లోపే నలుగురు సజీవ దహనమయ్యారు పెంటయ్య భార్య ఇద్దరు పిల్లలు ,అతని అత్తా మాది మసైపోయారు.
నిద్ర పోదామని మూసిన కళ్ళు తెరవనె లేదు అమ్మ పొత్తిళ్ళలో పడుకున్న పసివాళ్ళు మాంస ముద్దలుగా మారారు పిల్లల తల్లి ఆమె తల్లి మొత్తం నలుగురు అగ్ని ఖీలాలకు సజీవ దహనమయ్యారు కరెంట్ మీటరు లేని ఇంట్లో షార్ట్ సర్క్యు ట్ ఎలా జరిగింది తల దాచుకోమని స్తలమిచ్చిన దాతలే వాళ్ళ బతుకుల్ని కాలరల్చార పెద్ద మనుషుల్లా చలమవుతున్న వారే నలుగురి చావుకి ముహూర్తం పెట్టారా . . . .
పెంటయ్య కుటుంబం పదేళ్ళ క్రితం బతుకు తెరువు కోసం మరవెల్లి గ్రామానికి వలస వచ్చారు అప్పటి పెద్దలు కొంత స్తలాన్ని దానంగా ఇచ్చారు అప్పటి నుండి ఆ స్తలంలో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు ఆచం అనే వ్యక్తీ ఆ స్తలం తనదని పెంటయ్య ను ఖాళి చేయాలని బెదిరిస్తున్నాడు ఈ విషయంలో 23వ తేది మధ్యాహ్నం గొడవ జరిగింది స్తలం ఖాలీ చేయకపోతే ఇంటిల్లి పాదిని చంపేస్తానని ఆచం బెదిరించాడు ఎప్పుడు ఉండే గొడవే అని గ్రామస్తులు లైట్ తీసుకున్నారు కాని అదే నలుగురి ప్రాణాల్ని బలి తీసుకుంటుందని ఊహించ లేకపోయాం అంటున్నారు స్థానికులు.
పెంటయ్య స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటాడు అతను trs పార్టీ లో తిరగటం ఊల్లొని కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు స్తలం ఇచ్చి ఊల్లొ ఉండనిస్తే ప్రత్యర్ది పార్టీ లో తిరుగుతున్నాడనే కోపంతో ఆచం ను పురిగొల్పినట్లు తెలుస్తోంది మరవెల్లి లో కాంగ్రెస్ లీడర్ సంగమేశ్వర్ హవా నడుస్తూ ఉంటుంది అతనే అచం ని ప్రోత్సహించి పెంటయ్య కు స్పాట్ పెట్టాడని అతను లేకపోవటంతో కుటుంబ సభ్యులు బలయ్యారని గ్రామం లో గుసగుసలు వినిపిస్తున్నాయి పాత కక్షలే ఈ ఘాతుకానికి కారణం అంటున్నారు స్థానికులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)