ఆందోల్ నియోజకవర్గం లోని మంజీరా నది లోని నీరు రైతాంగానికి ఉపయోగపడితే అందులోని ఇసుక కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది ముఖ్యంగా ఆందోల్ మండలం లోని గ్రామ పరివాహక ప్రాంతం లోని మంజీరా నదిలో నుండి ట్రాక్టర్ ల ద్వారా యదేచ్చగా ఇసుక తరలిపోతున్న ఇటు రెవిన్యూ అధిఖారులు అటు పోలీసు అధిఖారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం విమర్శలకు తావిస్తోంది మంజీరా నది నుండి ట్రాక్టర్ల ద్వారా గాడిదలపై తరలించిన ఇసుకను నది పరివాహక ప్రాంతాలలో గ్రామ పొలిమేరలలో ఇసుకను నిల్వ చేసి అనంతరం ఒక్క ట్రాక్టర్ కు 2500 నుండి 3000 ల రూపాయల చొప్పున ఇసుకను తరలిస్తూ సామన్యులనుండి డబ్బులు దండుకుంటున్నారు చట్టాన్ని చుట్టంగా మర్చుకునేవారి అందరిపై మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి లు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు, స్థానిక నాయకులు కోరుతున్నారు మండలంలోని భూగర్భ జలాలు అడుగంటి పోనియ్యకుండా కాసులకు కక్కుర్తి పడకుండా అక్రమ ఇసుక వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోని రైతులను కాపాడుతారని ఆశిద్దాం.
సేకరణ : సంజీవ్ కుమార్