బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

29, మార్చి 2013, శుక్రవారం

మెదక్ జిల్లాలో దొంగల బీభత్సం



కోహీర్ మండలం కవేలి లోని సిండికేట్ బ్యాంకు లో దోపిడీకి యత్నం  
దొంగలు, పోలీసులకు మధ్య కాల్పులు 
ఎస్ ఐ నోముల వెంకటేష్కి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం 

27, మార్చి 2013, బుధవారం

హోలీ పండగపూట మంజీరా నది తీరంలో స్నానానికి వెల్లి ఇద్దరి మృతి

రెండు వేరువేరు సంఘటనలో స్నానానికి వెల్లి ఇద్దరు మృతి చెందారు. 

నాగరాజు పాత చిత్రం 
జోగిపేట  లో హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ గ్రామమంతా సంబరాలు జరుపుతుండగా ఆందోల్ సమీప ప్రాంతంలో మంజీరా నది తీరంలో స్నానానికి వెల్లి నీటమునిగి జోగిపేట కు చెందిన నాగరాజు అనే వ్యక్తి (22 సం) చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ రంగులు చల్లుకున్న నాగరాజు తన స్నేహితులు స్నానానికి వెల్లి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో  మంజీరా నది లో  మృతి చెందాడు 




 రాజు పాత చిత్రం 
జోగిపేట పట్టణానికి చెందిన ముదుటి రాజు (30) బుధవారం స్నానం చేసేందుకు మండలంలోని చింతకుంట శివారు మంజీరా నదిలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం హోలీ వేడుకలో పాల్గొన్న రాజు స్నానాలు చేసేందుకు స్నేహితులతో కలసి చింతకుంట శివారు మంజీరా నదికి వెళ్లాడు. అక్కడ నీటిలోకి దూకిన రాజు తేలకపోవడంతో స్నేహితులు కంగారు పడి వెతికారు. కాసేపటి తరువాత మృతదేహం తేలడంతో 108కు సమాచారం అందించారు. వారు రాజు మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి తీసుకువచ్చారు. మృతుడు ఈజీఎస్‌లో మేట్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ అనారోగ్యంతో ఉన్న కారణంగా కొన్ని రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలు చూస్తున్నాడు.

23, మార్చి 2013, శనివారం

అల్లాదుర్గ్ మండలం విలేఖరుల ఫోన్ నంబర్లు

భూమన్న                    ఆంధ్ర భూమి                           9441456753
సాయిలు                      ఈనాడు                                  8008902844
మనేప్ప                       సాక్షి                                      9490129855
వీరేందర్                        సాక్షి  రూరల్                            9705347307
విజయ రమేష్                 వార్త                                     9440380748
నర్సింలు                       నమస్తే తెలంగాణ                        9440061074
కుమార్                        నమస్తే తెలంగాణ రూరల్                 9491226902
రమేష్                          ఆంధ్ర జ్యోతి                              9440847571
వీరన్న                          ఆంధ్ర జ్యోతి  రూరల్                    9951468167
కృష్ణ                            ఆంధ్ర ప్రభ                                 9704517340

22, మార్చి 2013, శుక్రవారం

24న 24 గంటల పాటు తెలంగాణ బంద్‌




జేఏసీ, టీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినందుకు నిరసనగా ఈనెల 24న 24 గంటల పాటు తెలంగాణ బంద్‌ను నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రకటించాయి. టీపీజేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్ హైదరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం లోపు కేసులను ఎత్తివేసి, నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమించిన వారందరిపై కేసులు బనాయిస్తూ జైళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నదని, దీనికి తగిన విధంగా బుద్ధి చెప్పి తీరుతామని ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. 

మెదక్ జిల్లాలో చిన్నపిల్లల విక్రయాలు

అత్యాచార నిరోధక నేర న్యాయ (సవరణ) బిల్లు-2013

అత్యాచార నిరోధక బిల్లుకు పార్లమెంటు ఆమోదంఅత్యాచార నిరోధక బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా ఊపింది. నేర న్యాయ (సవరణ) బిల్లు-2013గా వ్యవహరిస్తున్న ఈ బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ ఈ నెల 19నే బిల్లుకు ఆమోదం తెలిపింది. అత్యాచారం, యాసిడ్ దాడులు తదితర నేరాలకు మరణ శిక్ష, జీవితాంతం జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు విధించేందుకు ఈ బిల్లును తెచ్చారు.

అత్యాచార నిరోధక నేర న్యాయ (సవరణ) బిల్లు-2013 బిల్లులోని ముఖ్యాంశాలు.....

*రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అవసరమైతే చనిపోయేంతవరకు జైలు శిక్ష, జరిమానా
*గతంలో ఈ నేరాల్లో దోషిగా తేలి, మళ్లీ అలాంటి వాటికి పాల్పడితే మరణశిక్ష
*పరస్పరామోద శృంగారానికి వయోపరిమితి 18 ఏళ్లు
*మహిళలను వెంటాడటం, ఇతరులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు దొంగచాటుగా చూసే నేరాలకు తొలిసారి పాల్పడితే బెయిల్. పదేపదే పాల్పడితే బెయిల్ నిరాకరణ. ఈ నేరాలను శిక్షార్హమైన నేరాలుగా ప్రకటిచండం ఇదే తొలిసారి
*యాసిడ్ దాడి దోషులకు 10 ఏళ్ల జైలు శిక్ష(ఈ దాడిని నే రంగా ప్రకటించడం ఇదే తొలిసారి). ఈ దాడి బాధితులకు ఆత్మరక్షణ హక్కు.
*అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులకు అన్ని ఆస్పత్రులూ తప్పనిసరిగా చికిత్స అందించాలి. నిరాకరిస్తే జైలు శిక్ష.
*పోలీసు అధికారులు, ప్రజాసేవకులు, సాయుధ బలగాల సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది.. మహిళలపై తీవ్ర నేరాలకు పాల్పడితే క నీసం ఏడేళ్ల జైలు శిక్ష. అవసరమైతే యావజ్జీవం, జరిమానా.
*రేప్ బాధితురాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక, శారీరక వికలాంగురాలైతే ఆమె వాంగ్మూలాన్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు అనుసంధానకర్త సాయంతో నమోదు చేయించడానికి అనుమతి. వాంగ్మూల ప్రక్రియను వీడియో చిత్రీకరించడం..

నేడు ప్రపంచ జల దినోత్సవం




బొట్టు బొట్టూ... కాపాడదాం
భారీగా తగ్గుతున్న జలమట్టాలు
ఆదా చేస్తేనే భావి తరాలకు మనుగడ



జలం... గాలి తరువాత జీవకోటికి అత్యవసరమైన ప్రకృతి వనరు. మానవాళి మనుగడలో జలానిదే ప్రధాన భూమిక. ఇతర గ్రహాలకు భిన్నంగా భూగోళంపై ప్రాణకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధాన కారణం. కానీ ప్రస్తుతం జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోయాయి. వందలకొద్దీ లోతుకు వెళ్లినా కడివెడు నీరు దక్కని పరిస్థితి. కారణాలేమైనా క్షీణించిపోతున్న ప్రకృతి సంపదలో జలం కూడా చేరిపోయింది. ఇప్పుడైనా మనం జాగ్రత్తపడి బొట్టుబొట్టూ కాపాడి భవిష్యత్ తరాలకు అందించలేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

ఈ రోజే ఎందుకంటే
ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న
జలవనరుల వల్ల రానున్న రోజుల్లో నీటి సంక్షోభాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1993 మార్చి 22న సమావేశమైంది. నీటి సంక్షోభాన్ని నివారించడానికి పలు చర్యలపై చర్చించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

21, మార్చి 2013, గురువారం

అవసరమయ్యే వెబ్ సైట్లు

టేక్మాల్ మండలం విలేఖరుల ఫోన్ నంబర్లు


మహేందర్              ఈనాడు                8008573246
బీరప్ప                   సాక్షి                    9492652143
సత్యం                    నమస్తే తెలంగాణ    9705270607
లింగం                    ఆంధ్ర జ్యోతి           9949806182
ఆనంద్                   వార్త                    9989648575
భాగయ్య                 ప్రజాశక్తి                8500205155
నర్సింలు                 ఆంధ్ర ప్రభ             9849735254

20, మార్చి 2013, బుధవారం

17, మార్చి 2013, ఆదివారం

బాద్ షా ఆడియో వేడుకలో అపశృతి

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్ర ఆడియో రిలీజ్ వేడుక వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది.  ఈ సంఘటనలో వరంగల్ జిల్లా ఉర్సుగుట్టకు చెందిన రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నానక్ రాంగూడలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. జారీ చేసిన పాసులకంటే అధిక సంఖ్యలో అభిమానులు హాజరుకావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు తెలిసింది. 


11, మార్చి 2013, సోమవారం

ఏడుపాయల జాతర - బోనాల ఊరేగింపుతో సందడే సందడి



మహాశివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏడుపాయల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎల్లలు దాటి తరలివచ్చిన భక్త జనాలతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబసమేతంగా తరలివచ్చి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగం జాతరలో మకాంవేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతుండగా, పోలీసులు మెటల్ డిటెక్టర్లతో భక్తులను తనిఖీ చేసి దుర్గమ్మతల్లి దర్శనానికి అనుమతించారు. ప్రత్యేకపోలీసు బలగాలతో అధునాతన టెక్నాలాజిని ఉపయోగించుకుంటూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. 


ఏడుపాయల అమ్మవారికి సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి స్వర్ణ కిరీటం





10, మార్చి 2013, ఆదివారం

లింగాష్టకం – తెలుగు


బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

9, మార్చి 2013, శనివారం

నా మిత్రులందరికి మహా
శివరాత్రి పర్వదిన
శుభాకాంక్షలు...... 

ఆ భోలా శంకరుడు మీకు సకల
శుభాలని అందించాలని
మనస్పూర్తిగా
కోరుకుంటున్నాను ..........

7, మార్చి 2013, గురువారం

సాహస పథం

గాల్లో తేలియాడుతూ భాలిక విన్యాసాలు 
కన్నార్పకుండా చుసిన జనం 


జోగిపేట - www.jogipet.com :-   సాహసం చేస్తే రాజకుమారి సిద్దించటం నాటి కథ .....   విన్యాసం చేస్తే తప్ప పూట గడవకపోవటం వీరి వ్యధ. ఆడుతూ పాడుతూ చక్కగా బాల్యాన్ని ఆస్వాదించాల్సిన వయసులో ప్రమాదం అంచున నడుస్తూ బతుకుబండి నడిపిస్తున్న చిన్నారి వైనమిది.  

         ఓడిశా కు చెందిన 25 ఏళ్ళ దిన్దియల్, 9 ఏళ్ళ కీర్తి బృందం సాహస విన్యాసాలతో జీవన సమరం సాగిస్తున్నారు తన నాన్న డప్పు వాయిస్తుండగా కీర్తి ఒళ్ళు గగుర్పాటు కలిగించే రీతిలో స్థానిక తహశిల్దార్ కార్యాలయం వద్ద చేసిన విన్యాసాలు చూపరులను విస్మయానికి గురిచేసాయి. తలపై మూడు వస్తువులు మోస్తూ వాటిని పడిపోకుండా బాలన్స్ చేస్తూ చేతితో అడ్డంగా కర్ర పట్టుకొని తాడుపై నడుస్తూ ఈ బాలిక ఏమాత్రం తోట్రుపాటు లేకుండా చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. కాళ్ళకు జోళ్ళు వేసుకుని తాడు పై నడుస్తూ, కాళ్ళక్రింద ప్లేటుతో ముందుకు వేలుతూ చేసిన సాహస కృత్యాలు చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసాయి. పలువురు ఈ బాలిక విన్యాసాలను చూసి ఆనందించారు. 

                                                                                                                                     www.jogipet.com

6, మార్చి 2013, బుధవారం

సంగుపేటలోఉరి వేసుకుని ఆత్మహత్య :

జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయిలు హాల్ టికెట్ ఇవ్వలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య.  



జోగిపేట.కాం : చదువే ప్రాణంగా భావించే విద్యార్థి ఆత్మహత్యకు ఒడిగట్టాడు.  భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ విద్యార్థి ప్రైవేటు కళాశాల ఫీజుల భూతానికి బలయ్యాడు. ఇంటర్ పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థి కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ అలియాస్ సాయిలు (17) తన ఇంట్లో ఉరి వేసుకుని  తనువు చాలించాడు. అందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన కొండగారి సాయిలు  జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 
                                                                                                                        www.jogipet.com

జోగిపేటలో దుర్గాభవాని మాత

మాసాన్ పల్లిలో ఓ ఇంట్లో చోరి 25 తులాల బంగారం లక్షా యాబైవేల రూపాయల నగదు అపహరణ.


 ఏడుపాయలకు వెళ్లివచ్చే లోపు ఇల్లు గుల్లయింది. ఇరవై తులాల బంగారం, రూ.1.37 లక్షలు నగదు దొంగలు అపహరించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి అందోల్ మండలం మాసాన్‌పల్లిలో చోటుచేసుకుంది.  రాములుకు గ్రామంలో రెండు ఇళ్లు ఉన్నా యి. కుటుంబం మొత్తం కొత్త ఇంట్లో నివాసం ఉంటారు. కుమారుడు అశోక్, కోడలు రాణిలు రాత్రి సమయంలో పాత ఇంటికి వెళ్లి ఉంటారు. ఆదివారం వారు ఏడుపాయల వెళ్లి అక్కడే బసచేశారు.ఇదే అదునుగా భావించిన దొంగ లు పాత ఇంటి తలుపును తొలగించి లోపలికి చొరబడ్డారు. చిమ్మెట, ఇతర పరికరాలు ఉపయోగించి మూడు బీరువాలు ధ్వంసం చేశారు. అందులోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.37లక్షలు నగదు అపహరించారు.ఒంటరిగా ఉండే పొరుగింటి అంజమ్మ రాములు వద్ద దాచుకున్న 80 తులాల వెండి ఆభరణాలు, రెండు మాసాల బంగారు గజ్జెలు, కాన్పుకు వచ్చిన రాములు కూతురు కవితకు చెందిన 5.5 తులాల ఆభరణాలు, ఇతర ఆభరణాలు అపహరించారు. రాములు ఇటీవల చెరకు అమ్మగా వచ్చిన డబ్బులు, ఎడ్లను అమ్మగా వచ్చిన మొత్తం డబ్బు రూ.1.37వేలు ఇంటిలోనే దాచిపెట్టారు. అవి కూడా చోరీ అయ్యాయి. మొత్తం సుమారు రూ.7.50 లక్షల సొత్తు అపహరణకు గురైంది. విషయం తెలిసిన వెంటనే క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. జాగిలాలు వచ్చి ఇంటి నుంచి అందోల్ చెరువు వరకు వెళ్లి తిరిగి గ్రామంలోకి చేరుకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

3, మార్చి 2013, ఆదివారం

1, మార్చి 2013, శుక్రవారం

దొంగలు బాబోయ్ దొంగలు

మెదక్ జిల్లాలో సిఎం ఆధ్వర్యంలో MLA,MLCలకు అవగాహనా సదస్సు



పటాన్‌చెరు www.jogipet.com :- భానూర్ పంచాయతీ పరిధిలోని లహరీరిసార్ట్స్‌లో ఈ నెల 5,6 తేదీలలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

అంతా దైవలీల @ మెదక్ 01

అంతా దైవలీల @ మెదక్ 02

పట్టపగలే నగల దొంగతనం

మెదక్ జిల్లాలో భూఖబ్జాధారులు